‘డాలి’ అనే ఓ కుక్క పిల్ల తెల్లగా, బొద్దుగా ఉండేది. చూడటానికి ముద్దుగానూ వుంటుంది. దానికి మాంసం అంటే చాలా ఇష్టం. ఓసారి అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మాంసం ముక్క దొరికింది. డాలి ఆనందపడి నోటితో దానిని పట్టుకొని పరుగుపెట్టింది. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది. మధ్యలో నీటి కాలువ ఎదురైంది. దాన్ని దాటుతుండగా దాని నీడ అందులో కనబడింది. దాని నోట్లో కూడా మాంసం ముక్కను కడా తినాలనిపించింది. దాన్ని అందుకుందామని నీళ్ళలోకి మూతి పెట్టి నోరు తెరిచింది కానీ, అక్కడ వేరే మాంసం ముక్క లేదు. పైగా నోట్లో ఉన్న మాసం ముక్క కూడా నీళ్ళలో పడికొట్టుకు పోయింది. దాంతో డాలికి ఉన్నది పోయింది. ఉంచుకున్నది పోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: